టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు యమా దూకుడు మీదున్న రష్మిక మందన్న ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో చాలా బిజీగా వుంది రీసెంట్ గానే రశ్మిక ఒమన్ దేశంలో బర్త్ డే ను సెలెబ్రేట్ చేసుకుంది. ఆమె.. తన లవర్ విజయ్ దేవరకొండ తో కలిసి బర్త్ డే వేడుకలను జరుపుకుంది.. అంటూ వారు విడివిడిగా పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి నెటిజెన్స్ డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో హడావిడిగా మారిన రష్మిక తాజాగా ఓ వీడియో వదిలింది. ఎర్రటి కళ్లతో రష్మిక ఆ వీడియోలో కనిపించింది. గత కొన్ని రోజులుగా తాను నైట్ షూట్స్ లో పాల్గొనడం వలన, రాత్రిళ్ళు షూటింగ్స్ లో పాల్గొనడం వలన తన కళ్ళు ఇలా ఎర్రగా మారయంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
అయితే ఈ వీడియో సరదాగా చేశాను అంటూనే అందరికి గుడ్ మార్కింగ్ చెప్పింది రష్మిక. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక త్వరలోనే కుబేరతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.