వైసీపీ పార్టీని వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకుని సైలెంట్ గా ఉన్నప్పటికీ కేసులు మాత్రం విజయసాయి రెడ్డిని వదలడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ 2 గా చలామణి అయిన విజయసాయి రెడ్డికి వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయాక కొన్నాళ్ళు యాక్టీవ్ గా ఉన్న విజయ సాయి రెడ్డి కేసులకు భయపడి పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. త్వరలోనే బిజెపి లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది.
ఈలోపులో విజయ్ సాయి రెడ్డి పలు రకాల కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 18వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసుపై విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ సిట్ అధికారులు విజయ సాయి రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల విజయవాడ సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.