కొద్దిరోజులుగా అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యాక బరువు తగ్గిపోయి షాకిచ్చారు. ప్రశాంత్ నీల్ మూవీ కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గారు, అందుకోసం ఆయన ఏకంగా 14 కేజీలు బరువు తగ్గారు అన్నారు. ఆ తరవాత జెప్టో యాడ్ లో కనబడిన ఎన్టీఆర్ లుక్స్ పై తీవ్ర విమర్శలొచ్చాయి.
ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్స్ లో ఎన్టీఆర్ లుక్ విషయంలో అభిమానులు కూడా కంగారు పడ్డారు. ఎన్టీఆర్ ఎందుకింతగా సన్నబడ్డారో అంటూ సోషల్ మీడియాలో డిస్కర్షన్ మొదలయ్యాయి. అంతేకాదు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బరువుపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
తారక్ ని సన్నబడమని మీరేమైనా సలహా ఇచ్చారా అని కళ్యాణ్ రామ్ ని అడిగితే.. తారక్ ఏమైనా చిన్న హీరోనా, పాన్ ఇండియా హీరో, ఎన్టీఆర్ స్థాయి పాన్ ఇండియాకి చేరింది, మరో పాన్ ఇండియా అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. వాళ్ళకి నేను సలహాలు ఇస్తానా, నేను తారక్ ఏం చేసినా సినిమా కోసమే అంటూ ఎన్టీఆర్ అసలెందుకు బరువు తగ్గాడో అనే విషయాన్ని మాత్రం కళ్యాణ్ రామ్ రివీల్ చెయ్యలేదు.