ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఒకప్పుడు ఎంతగా తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఫేమస్ అయ్యారో.. ఇప్పటికి ఇళయరాజా నుంచి ట్యూన్స్ వస్తున్నాయంటే మ్యూజిక్ లవర్స్ కి మాత్రం పండగే. ఇళయరాజా చార్ట్ బస్టర్ సాంగ్స్ ని యూత్ ఎంజాయ్ చేస్తూ వుంటారు. అయితే ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత ఫేమస్ అయినప్పటికీ కొద్దిరోజులుగా కొన్ని కాంట్రవర్సీ విషయాల్లో తెగ హైలెట్ అవుతున్నారు.
మలయాళంలో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మంజుమ్యల్ బాయ్స్ చిత్రంలో తన అనుమతి లేకుండా తన సాంగ్ ట్యూన్స్ వాడినందుకు గాను ఆ చిత్ర యూనిట్ ని ఇళయరాజా ముప్పుతిప్పలు పెట్టిన ఘటన మరువకముందే ఇప్పడు ఇళయరాజా మరో చిత్ర బృందానికి బిగ్ షాక్ ఇచ్చారు.
రీసెంట్ గా తెలుగు,తమిళ్ ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్-త్రిష ల గుడ్ బ్యాడ్ అగ్లీ లోను తన ట్యూన్ అనుమతి లేకుండా వాడినందుకు చిత్రబృందానికి ఇళయరాజ షాకిచ్చారు. తన అనుమతి లేకుండా గుడ్ బ్యాడ్ అగ్లీలో తన ట్యూన్ వాడినందుకు గాను తనకి 5 కోట్లు ఆ చిత్ర యూనిట్ చెల్లించాలి అని ఇళయరాజ అజిత్ సినిమా మేకర్స్ కు ఊహించని షాకిచ్చారు. దీనితో ఈ వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.