సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్ లో ఓ మార్క్ సెట్ చేసాడు. కామెడీ జోనర్ లోనే కిక్ ఇచ్చే డైలాగ్స్ తో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో సిద్దు జొన్నలగడ్డ యూత్ ని టార్గెట్ చేసాడు. అందుకే డీజే టిల్లు, టిల్లు స్క్వీర్ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి.
కానీ సిద్దు జొన్నలగడ్డ జోనర్ మార్చి చేసిన జాక్ మాత్రం యూత్ ని మెప్పించలేకపాయింది. యూత్ లోని ఓ వర్గం వారు జాక్ బావుంది అన్నప్పటికీ చాలామందికి జాక్ నచ్చలేదు. దానితో సిద్దు జాక్ చిత్రం డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అసలు మొదటిరోజు జాక్ ఓపెనింగ్స్ కూడా సిద్దు క్రేజ్ వలన వచ్చినవే.
ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ నుంచి మరో చిత్రం రాబోతుంది. అది లేడీ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న నీరజ కోన దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ-రాశి ఖన్నా-శ్రీనిధి శెట్టి కలయికలో లవ్ స్టోరీగా తెలుసు కదా తెరకెక్కుతుంది. ఈచిత్రంపై ఇప్పటివరకు ఎంతవరకు బజ్ ఉందొ తెలియదు, కానీ సిద్దు మళ్లీ ఫామ్ లోకి రావాలంటే టిల్లు క్యూబ్ చెయ్యాల్సిందే అనే డిమాండ్ మాత్రం వినబడుతుంది యూత్ నుంచి.
సిద్దు కూడా వరసగా చేస్తున్న సినిమాల మధ్యలో టిల్లు క్యూబ్ చేస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు సిద్దు తెలుసు కదా చిత్రం విడుదలయ్యాక దాని రిజల్ట్ ని బట్టి టిల్లు క్యూబ్ ని పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.