డిజాస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తమిళ హీరో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారు అనగానే అందరిలో ఆశ్చర్యం, విజయ్ సేతుపతి ఫ్యాన్స్ లోను, తమిళ ఆడియన్స్ లోను షాక్. ఇప్పటికే ఈప్రాజెక్టు పై ఎంత క్రేజ్ మొదలైందో అన్ని అనుమానాలు నడుస్తున్నాయి. పూరి తో విజయ్ సేతుపతి సినిమా ఎందుకు ఒప్పుకున్నారు అంటూ ఓపెన్ గానే అడుగుతున్నారు.
తాజాగా విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ తో వర్క్ విషయమై రియాక్ట్ అయ్యారు. పూరి దర్శకత్వంలో నా సినిమా షూటింగ్ జూన్ లో మొదలు కాబోతుంది. నేను పూరి గత సినిమాల రిజల్ట్స్ చూసి సినిమా ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన కథ నచ్చి ఆయనతో సినిమా చేస్తున్నాను. ఆయన చెప్పిన కథ, కథలోని కంటెంట్ ఇంపార్టెంట్, అంతేకాని ఆయన గత సినిమాల రిజల్ట్ తో నాకు పని లేదు.
పూరి చెప్పిన స్టోరీ నచ్చింది, ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమా చేయలేదు, ఎప్పుడూ కొత్తగా చెయ్యాలనుకుంటాను, గతంలో చేసిన కథలు రిపీట్ కాకుండా చూసుకుంటాను అంటూ విజయ్ సేతుపతి పూరి తో పని చేయడంపై మాట్లాడారు. ఇక టబు తో వర్క్ చెయ్యడం చాలా స్పెషల్ అంటూ విజయ్ సేతుపతి అన్నారు. పూరి-విజయ్ సేతుపతి కాంబో చిత్రంలో టబు కీ రోల్ లో కనిపించబోతున్నట్టుగా రీసెంట్ గానే ప్రకటించారు.