ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల వెళ్లి ఏదో పైపైన శ్రీవారిని దర్శించేసుకుని కొడుకు కోసం మొక్కులు చెల్లించడం కాదు, ఆమె తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చేవరకు అన్నా శ్రీవారిపై భక్తి చూపించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కుమారుడు మార్క్ శంకర్ క్షేమం కోసం అన్నా శ్రీవారికి తలనీలాలు సమర్పించడం దగ్గర నుంచి అక్కడ శ్రీవారి అన్నదాన సత్రానికి భారీ విరాళం ఇవ్వడం, అలాగే శ్రీవారి దర్శనం కోసం అన్నా లెజినోవా చీర కట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో కనిపించడమే కాదు ఆమె తిరుమల వెళ్లగానే అక్కడ TTD సిబ్బంది నడుమ డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టడం హైలెట్ అయ్యింది.
ఇదంతా చూసి దెబ్బకి సోషల్ మీడియా మొత్తం సైలెంట్ అయ్యింది. లేదంటే పవన్ కళ్యణ్ భార్య అన్నా తిరుమలలో అడుగుపెట్టకుండానే ఆమె డిక్లరేషన్ పై సైన్ చేస్తుందా, ఆమె ప్రసాదం తింటుందా, ఆమె భక్తితోనే తిరుమల వెళ్లిందా, పవన్ భార్య వేరే మతస్తురాలు శ్రీవారి చెంతకు వెళ్లినా అంత భక్తి ఉంటుందా అంటూ దీర్ఘాలు తీసిన వారికి అన్నా లెజినోవా అంత భక్తిగా శ్రీవారి దర్శనం చేసుకుని వెనుతిరగడం మాత్రమే గట్టిగా షాకిచ్చింది అనే చెప్పాలి. వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ పవన్ సతీమణి తిరుమల టూర్ పై కామెంట్ చెయ్యకుండా గమ్మున ఉండిపోయారు.