మిల్కి బ్యూటీ తమన్నా నటించిన ఓదెల 2 ఏప్రిల్ 17 అంటే ఈ గురువారమే విడుదలకు సిద్దమవుతుంది. పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కిన ఓదెల 2 పై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు సంపత్ నంది అండ్ టీమ్. తమన్నా ఓదెల 2 కూడా ప్రమోషన్స్ లో హడావిడి చేస్తుంది. ఓదెల 2 అరుంధతి అంత హిట్ అవుతుందా అంటూ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేడు హైదరాబాద్ లో శర్వానంద్ గెస్ట్ గా ఓదెల 2 ప్రీ ఈవెంట్ జరిగింది. అయితే తమన్నాకు ఓదెల 2 ప్రమోషన్స్ లో పెళ్లిపై, ప్రేమపై ఆశక్తికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కారణం తమన్నా రీసెంట్ గానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమకు బ్రేకప్ చెప్పింది ఆ విషయం కన్ ఫర్మ్ చెయ్యలేదు కానీ... ప్రేమంటే నిజాయితీ, నేను నిజాయితీ గల ప్రేమను ఇష్టపడ్డాను అంటూ బ్రేకప్ పై ఇండైరెక్ట్ ట్వీట్లు వేస్తుంది ఆమె.
ఇక పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు తమన్నా తడుముకోకుండా ప్రస్తుతం అంటే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సమాధానమిచ్చింది. ఇక అవకాశాలు లేక చిన్న చిత్రాలు ఒప్పకుంటున్నారా అని అడగగా.. దానికి చిన్న సినిమాలు,పెద్ద సినిమాలు అని ఆలోచించను, కంటెంట్ బావుందా లేదా అనేది మాత్రమే చూస్తాను, కంటెంట్ బావుంటేనే అది పెద్ద సినిమా అవుతుంది, లేదంటే చిన్న సినిమాగానే మిగిలిపోతుంది అంటూ తమన్నా సమాధానమిచ్చింది.