యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్లిపోయారు. అక్కడనుంచి రాగానే ఎన్టీఆర్ ముందుగా ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) సెట్ లోకి వెళ్ళిపోతారు. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ దేవర 2 సెట్స్ మీదకి వెళతారని ఆయన అన్న, దేవర వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ లో రివీల్ చేశారు.
దేవర 2 ఉండదు, దేవర 1 కొచ్చిన ఫీడ్ బ్యాక్ చూసాక దేవర 2 లైట్ తీసుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ పదే పదే దేవర 2 అప్ డేట్ ఇస్తున్నారు, వర గురించి తెలుసుకునేందుకు దేవర 2లో చాలా ఉంది అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి డ్రాగన్ ఫినిష్ అవ్వగానే ఎన్టీఆర్ దేవర 2 ని పూర్తి చేస్తారట.
ఆ తర్వాతే నాగవంశీ నిర్మాతగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉంటుంది అంటూ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లైనప్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ మూడు చిత్రాలు మాసివ్ ఫిలిమ్స్ కావడం ఇక్కడ గమనార్హం. ఇక ఎన్టీఆర్ వెకేషన్ నుంచి రాగానే ఏప్రిల్ 22 నుంచి నీల్ మూవీ సెట్ లోకి వెళ్ళబోతున్నారు.