వార్ 2 షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో మేకర్స్ బిజీ అవడమే కాదు, ఆగష్టు 14 న వార్ 2 పక్కా రిలీజ్ అంటూ ఎన్టీఆర్ కన్ ఫర్మ్ చేసారు కూడా. అటు అన్న కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కోసం నిలబడిన ఎన్టీఆర్ ఈ నెల 22 నుంచి ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి వెళ్లేందుకు రెడీ అవుతారు అనుకుంటే.. ఆయన ఈ గ్యాప్ లో ఫ్యామిలీని తీసుకుని మినీ వెకేషన్ కి వెళ్లిపోయారు.
నిన్న ఆదివారం భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెడుతున్న ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ఈ మినీ వెకేషన్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ మూవీ సెట్ లోకి వెళ్ళిపోతారు, ఏకధాటిగా ప్రశాంత్ నీల్ మూవీని ఎన్టీఆర్ పూర్తి చేస్తారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది.