Advertisementt

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ డేట్ వస్తోంది

Mon 14th Apr 2025 10:25 AM
mad square  మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ డేట్ వస్తోంది
Mad Square OTT date coming up మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ డేట్ వస్తోంది
Advertisement
Ads by CJ

సక్సెస్ ఫుల్ మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం థియేటర్స్ లో కామెడీ ఎంటరైనర్ గా నిలిచింది. సంగీత్ శోభన్, నార్నె నితిన్, నితిన్ కలయికలో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మ్యాడ్ స్క్వేర్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఫస్ట్ ఆఫ్ కామెడీ రైడ్ గా నిలవగా, సెకండ్ హాఫ్ కాస్త వీక్ అయినా.. ఈ చిత్రానికి విపరీతమైన లాభాలొకొచ్చాయి. 

నిర్మాత నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ రివ్యూస్ పై, వెబ్ సైట్స్ పై ఫైర్ అయ్యారు, దానితో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగి థియేటర్స్ కి జనాలు కదిలారు. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో క్యూరియాసిటీ మొదలయ్యింది. 

అసలే సమ్మర్, అందుకు తగ్గ ఓటీటీ కంటెంట్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ హిట్ చిత్రాన్ని ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో నెట్ ఫ్లిక్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ డేట్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 

Mad Square OTT date coming up:

MAD Square OTT Release Date Details

Tags:   MAD SQUARE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ