కొడుకు క్షేమంగా బయటపడడంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమల విచ్చేసారు. పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్ లో అగ్నిప్రమాదానికి గురై చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు, చికిత్స అనంతరం మార్క్ శంకర్ ను తీసుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు.
కొడుకు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఈరోజు తిరుమల బయలుదేరి వెళ్లారు, రేపు తెల్లవారుఝామున సుప్రభాతసేవ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే ఆమె అన్యమతస్తురాలు కావడంతో పవన్ భార్య అన్నా తిరుమలలో డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టారు. అంతేకాకుండా తిరుమలలో అన్నా శ్రీవారికి తలనీలాలు సంపర్పించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఆమె వేరే దేశస్తురాలు, అయినప్పటికి కుమారుడి క్షేమం కోసం చక్కటి సాంప్రదాయ చీర కట్టులో అలా వేంకటేశ్వరుని కి తలనీలాలు సమర్పించడం పవన్ అభిమానులనే కాదు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తలనీలాలు సమర్పించిన తర్వాత ఆమె గుండుతో కనిపించారు.