సింగపూర్ లోని కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ కు గాయాలు కాగా.. పవన్ కళ్యాణ్, చిరంజీవి సింగపూర్ వెళ్లారు, మార్క్ శంకర్ కోలుకోగానే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ ను, భార్య అన్నాలెజినోవా తీసుకుని హైదరాబాద్ కి వచ్చేసారు.
కొడుకు అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ఆమె తిరుమల బయలుదేరి వెళ్లారు. అన్నాకొణిదల సోమవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు.
ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడ కొండపైనే ఈ రోజు రాత్రి బస చెయ్యనున్నారు. రేపు ఉదయం శ్రీవారి దర్శనం అంతరం ఆమె హైదరాబాద్ కి తిరిగొస్తారు.