Advertisementt

SSRMB టీమ్ కి సమ్మర్ హాలిడేస్

Sun 13th Apr 2025 07:51 PM
rajamouli  SSRMB టీమ్ కి సమ్మర్ హాలిడేస్
Summer holidays for SSMB 29 SSRMB టీమ్ కి సమ్మర్ హాలిడేస్
Advertisement
Ads by CJ

స్టూడెంట్స్ కు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, సెలబ్రిటీస్ సమ్మర్ హాలిడేస్ తీసుకుని వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు. కానీ SSMB 29 ప్రాజెక్ట్ కి సమ్మర్ హాలిడేస్ అంటే ఒకింత షాకవుతున్నారేమో మహేష్ అభిమానులు. SSMB 29 హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్ పూర్తయ్యాక రాజమౌళి-మహేష్ SSMB 29 నుంచి కాస్త విరామం తీసుకుని హాలిడే ట్రిప్స్ వేశారు. 

మహేష్ బాబు గత వారమే కూతురు సితార, భార్య నమ్రతలతో కలిసి ఇటలీ వెళ్లారు. అక్కడ గౌతమ్ ఉండడంతో ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లి అక్కడ ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. మరొపక్క రాజమౌళి తన కొడుకు కార్తికేయ తో కలిసి జపాన్ వెళ్లారు. అక్కడ ఆర్.ఆర్.ఆర్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 

అలా దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ వెకేషన్ వెయ్యడంతో SSMB 29 షూటింగ్ ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ లో ఉంది అంటూ సరదాగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక SSMB 29 షూటింగ్ కి గ్యాప్ దొరకడంతో మరో హీరో పృథ్వీ రాజ్, అలాగే హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ తమ పనుల్లో బిజీ అయ్యారు. 

Summer holidays for SSMB 29:

SS Rajamouli Is In Japan To Promote The Documentary RRR

Tags:   RAJAMOULI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ