రింగుల జుత్తు సుందరి అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ లో ఉందా? అంటే అవుననే మీడియాలో ప్రచారం సాగుతోంది. అనుపమ ప్రస్తుతం కోలీవుడ్ యువహీరో ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉందంటూ కథనాలొస్తున్నాయి. ఈ జంట డీప్ లిప్ లాక్ వేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోగ్రాఫ్‌ని వైరల్ చేస్తున్న అభిమానులు జంట బావుంది.. జోడీ కుదిరింది! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జంట ప్రేమాయణానికి తమ వంతు మద్ధతు అందిస్తున్నారు. అయితే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేసేవారు ఉన్నారు. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ ప్రస్తుతం బైసన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అతడి సరసన అనుపమ నటిస్తోంది.
ఈ జంటపై రొమాంటిక్ సీన్స్ ని తెరకెక్కించగా, వాటి నుంచి ఓ ఫోటో ఇలా లీక్ చేసి ఆట పట్టిస్తున్నారని కొందరు గెస్ చేస్తున్నారు. అయినా ఈ జంట అందంగా ఉంది... ప్రేమలో ఉంటే తప్పేమీ కాదు! అని కొందరు సమర్థిస్తున్నారు. మొత్తానికి అనుపమ డీప్ లిప్ లాక్ తనను మరోసారి లైమ్ లైట్ లోకి తెచ్చింది.
చియాన్ విక్రమ్ నటవారసుడైన ధృవ్ విక్రమ్ నాలుగేళ్ల క్రితం కథానాయకుడిగా ఆరంగేట్రం చేసాడు. కానీ కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలేవీ లేవు. ప్రస్తుతం అతడు పూర్తిగా నటనపైనే ఫోకస్ చేసాడు. అనుపమ పరమేశ్వరన్ అతడి కంటే చాలా సీనియర్ నటి. టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.