Advertisementt

కంపారిజన్స్ తో కంగారు పడుతున్న మెగా ఫ్యాన్స్

Sun 13th Apr 2025 01:34 PM
vishwambhara  కంపారిజన్స్ తో  కంగారు పడుతున్న మెగా ఫ్యాన్స్
Mega Fans are getting tension with Comparisons కంపారిజన్స్ తో కంగారు పడుతున్న మెగా ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ విజువల్ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన సినిమాకి (జూలై 24 ఇంద్ర డేట్ అంటున్నా)  ఇప్పటికీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ అవలేదు. కనీసం ఆ సినిమా నుంచి అప్ డేట్స్ ఏమైనా వస్తాయా అని ఆరాటంగా ఎదురు చూసిన అభిమానులకు నిన్న హనుమాన్ జయంతి గిఫ్ట్ గా విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ఎంచుకున్న అకేషన్ కి తగ్గట్టుగానే హనుమాన్ జయంతి రోజున శ్రీరాముణ్ణి కీర్తిస్తూ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. 

ఇక ఈ లిరికల్ వీడియో లో సెటప్ మొత్తం గ్రాండ్ గానే ఉన్నా, చిరంజీవి లుక్స్ ఇంప్రెసివ్ గానే అనిపించినా ఓ సెంటిమెంట్ మాత్రం అభిమానులను వెంటాడేస్తోంది. మళ్లీ అటువంటి రిజల్ట్ రాదు కదా, మళ్లీ అదే రిపీట్ అవ్వదు కదా అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అదేమిటంటే.. 

అప్పట్లో ఆచార్య సినిమా నుంచి ఇలాగే ఫస్ట్ సింగిల్ లాహే లాహే అంటూ సాగే శివుని మీద పాటతో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు. అందులోను భారీ సెటప్పే, అదీ భక్తి గీతమే. కానీ ఇప్పటికీ ఆ సినిమా ఫలితాన్ని మెగా ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. ఈసారి విశ్వంభర నుంచి రాముని పాటతో మొదలు పెట్టారు ప్రమోషన్స్. ఇంకా సీనియర్ మెగా ఫ్యాన్స్ చెబుతోన్న కంపేరిజన్స్ ఏమిటంటే. ఆచార్య కి రైట్ నౌ ఫామ్ లో ఉన్న దేవిశ్రీ కానీ, థమన్ కానీ, అనిరుద్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కాదు. గతంలో ఎప్పుడో చిరంజీవికి పని చేసిన మణిశర్మకి మరొక్కసారి ఛాన్స్ ఇచ్చి ఆచార్య ను ఆయన చేతుల్లో పెట్టారు చిరంజీవి. విశ్వంభర విషయంలోను అదే జరుగుతుంది. 

గతంలో ఎప్పుడో తనకి ఘరానా మొగుడు వంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన కీరవాణి ని విశ్వంభర టీమ్ లోకి తీసుకొచ్చారు చిరు, ఆ విధంగా అప్పుడు, ఇప్పుడు కూడా ఇద్దరూ సీనియర్ మ్యూజిక్ డైరేక్టర్సే, అలాగే ఈ రెండు పాటలు రాసింది ఆ రామజోగయ్య శాస్త్రే. ఇన్ని పోలికలు కనిపిస్తుంటే మరి అభిమానులు కంగారు పడడంలో అర్థముంది కదా.!

నిన్న విడుదలైన విశ్వంభర లోని రామ రామ సాంగ్ ఇప్పటికి 10 మిలియన్స్ వ్యూస్ అయితే గెయిన్ చేసింది కానీ పాట పట్ల మాత్రం మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. ఈ పాట కంటే అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన అల్లుడా మజాకా చిత్రం లోని మా ఊరి దేవుడు.. అందాల రాముడు పాటే బెటర్ అంటూ స్వయంగా మెగాభిమానులే సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. 

Mega Fans are getting tension with Comparisons:

>Mega Fans confusing with Comparisons

Tags:   VISHWAMBHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ