గత ఐదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి సజ్జల మరికొందరి చేతిలో కీలు బొమ్మగా తయారయ్యారు, సజ్జల వలనే వైసీపీ పార్టీ నాశనం అయ్యింది, ఐదేళ్లు జగన్ మోహన్ రెడ్డి జనంలోకి రాకుండా, కార్యకర్తలను పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో నిద్ర పోయారు, జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయాక కూడా సజ్జల నే ముందు పెట్టి మరీ చేస్తున్న పనులపై జగన్ మీడియానే అంటే బ్లూ మీడియానే వెలుగెత్తి చాటి చెబుతుంది.
సజ్జల వలన వైసీపీ పార్టీ సర్వ నాశనం అవుతుంది. పార్టీని వదిలి వెళ్లే వాళ్లంతా సజ్జల వలనే పార్టీ మారుతున్నట్టుగా ఇండైరెక్ట్ గా జగన్ కి చెబుతున్నా జగన్ ధోరణి లో ఏ మార్పు లేదని బ్లూ మీడియా నొక్కి వక్కాణిస్తుంది. సజ్జల రామకృష్ణ రెడ్డిని పక్కనపెడితే వైసీపీ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అని బ్లూ మీడియా చెబుతున్నా జగన్ మాత్రం ఇప్పటికి సజ్జల కు ప్రాధాన్యం ఇవ్వడం చూసి వైసీపీ కార్యకర్తలే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
తాజాగా వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కి సజ్జలను స్టేట్ కన్వీనర్ గా వ్యవహరిస్తారని జగన్ చెప్పడంతో కార్యకర్తలు షాకయ్యారు. సజ్జలను పక్కనపెట్టమంటే ప్రతి విషయంలోను సజ్జల రామకృష్ణ రెడ్డిని జగన్ ముందు పెట్టడం చూసి వారు నెత్తి నోరు కొట్టుకోవడమే కాదు, అసలు పార్టీలో ఉండాలో లేదో అని తేల్చి చెప్పమనడంతో జగన్ లాస్ట్ మినిట్ లో సజ్జల కన్వీనర్ కాదు, కో ఆర్డినేటర్ గా పని చేస్తారంటూ మార్పులు చేర్పులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
అసలు సజ్జల విషయంలో మీడియా కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఏమనుకుంటున్నారో జగన్ కు తెలియదా, తెలిసిన జగన్ పట్టించుకోవడం లేదా అని బ్లూ మీడియా ఎంత వివరంగా చెబుతున్న జగన్ మాత్రం సజ్జలకు ఇవ్వాల్సిన ఇంపార్టెంటెన్స్ ఇవ్వడం చూసి సజ్జల విషయంలో బ్లూ మీడియా పోరాడి ఓడింది అంటూ కామెంట్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.