Advertisementt

జాట్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sun 13th Apr 2025 11:33 AM
jaat  జాట్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది
Jaat missed a good chance జాట్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది
Advertisement
Ads by CJ

నిజమే జాట్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. ఏప్రిల్ 10 న హిందీలో మాత్రమే విడుదలైన జాట్ మూవీ సౌత్ లో కూడా అందులోను తెలుగులో అదే రోజు విడుదలైనట్టయితే మంచి క్యాష్ చేసుకునేది. ఆ రోజే తెలుగులో విడుదలైన జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు నిరాశ పరిచాయి. ఆతర్వాత రోజు విడుదలైన అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయ్ కూడా డిజప్పాయింట్ చేసింది.

అదే రోజు జాట్ హిందీతో పాటుగా తెలుగులో విడుదలైనట్టయితే హిందీలోలా తెలుగులోనూ హిట్ అయ్యేది. మరి తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు గోపీచంద్ తెలుగువాడే. కానీ తెలుగును లైట్ తీసుకుని ముందు హీరో గారి కోసం హిందీలో రిలీజ్ చేసారు. జాట్ చిత్రానికి నార్త్ లో సూపర్ రెస్పాన్స్ రావడమే కాదు, భారీ గా కలెక్షన్స్ కూడా రాబడుతుంది.

అదే ఏప్రిల్ 10 న తెలుగులో  అయితే ఇక్కడ కూడా కాసులు కురిసేవి. తెలుగు డబ్బింగ్ లేట్ అవడంతో ముందుగా హిందీలో రిలీజ్ చేసేసారు. మరో రెండు వారాల్లో తెలుగులోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నాడు. మరి జాట్ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి. 

Jaat missed a good chance:

Jaat Movie missed a good chance

Tags:   JAAT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ