ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు సింగపూర్ లో అగ్నిప్రమాదం జరిగి మూడు రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. పవన్ భావోద్వేగంతో అన్న చిరుతో కలిసి సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ కోలుకుని సింగపూర్ లోని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ విషయాన్ని మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా తమ బిడ్డ ఆరోగ్యంగా తిరిగి రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది అంటూ ట్వీట్ చేసారు.
నిన్నరాత్రి పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ని, భార్య అన్న లెజినోవా ని తీసుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు. కొడుకు మార్క్ శంకర్ ను పవన్ ఎత్తుకుని ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. పవన్ కొడుకుతో సహా హైదరాబాద్ కి తిరిగిరావడం చూసి ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పవన్ కొడుకు క్షేమంగా ఉండాలని సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కి ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెట్టారు. తనకు సపోర్ట్ గా నిలిచి కొడుకు క్షేమం కోరుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు పవన్.