కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ ది ఆర్చీస్ వెబ్ సిరీస్ తో నటిగా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ తర్వాత సుహానా మరో చిత్రానికి సంతకం చేయలేదు. కేవలం తన తండ్రితో కలిసి నటించాలని వేచి చూస్తోంది. సుహనా తన తండ్రి షారూఖ్ తో కలిసి కింగ్ సినిమాలో నటించనుంది.
ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఒక న్యూస్ పోర్టల్ తాజా కథనం ప్రకారం.. మే నెలలో షూటింగ్ ప్రారంభిస్తారని నిర్మాతలు తెలిపారు. పింక్‌విల్లా ప్రకారం.. ముంబైలోని ఒక స్టూడియోలో ప్రారంభం కానున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ తర్వాత యుఎఇ, యూరప్‌లో అంతర్జాతీయ షెడ్యూల్‌లను పూర్తి చేస్తారు. షారుఖ్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తాడు. అతడు డాన్ గా కిల్లర్ గా కనిపిస్తాడు. సుహానాను కాపాడే కింగ్ పిన్ పాత్రలో కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా కథాంశం ఏమిటన్నదానిపై ఇంకా పూర్తి స్పష్ఠత లేదు. ఈ చిత్రంలో సుహానా స్టంట్స్ చేసేందుకు ఆస్కారం ఉందని కూడా గుసగుస వినిపిస్తోంది. అయితే షారూఖ్ నటవారసురాలిగా సుహానా ఎలాంటి మార్క్ వేస్తుందో చూడాలని ఖాన్ అభిమానులు ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు.