సౌత్ కి బిగ్ బ్రేక్ ఇచ్చి హిందీ లో అందులోను వెబ్ సీరీస్ లను సెలెక్ట్ ముంబైలోనే మకాం పెట్టిన సమంత ఎప్పుడెప్పుడు సౌత్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుందా అని ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కానీ సమంత మాత్రం నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి ఆ వైపుగా కుడా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది.
సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేసే సమంత తాజాగా వదిలిన పిక్స్ మాత్రం కెవ్వు కేక అనేలా ఉన్నాయి. ఈమధ్యన వెయిట్ తగ్గి మరింత సన్నగా తయారైన సమంత గ్లామర్ షో విషయంలో అస్సలు తగ్గడం లేదు. క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో Say this to yourself అంటూ సమంత మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేసింది.
అన్నట్టు సమంత దర్శకుడు రాజ్ తో డేటింగ్ లో ఉంది, ఆమె త్వరలోనే రాజ్ కందుకూరి ని వివాహం చేసుకోబోతుంది అనే టాక్ కాదు ప్రమఖ ఛానల్స్ లో సమంత రెండో పెళ్లిపై పలు కథనాలు ప్రచారంలోకి రావడంతో ఆమె అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఈ విషయంలో సమంత రియాక్షన్ ఏంటో చూడాలి.