యూట్యూబర్, డాన్సర్ అయిన వైష్ణవి చైతన్య గతంలో చాలా చిత్రాల్లో హీరోలకు చెల్లెలి గాను, అలాగే హీరోయిన్స్ కి ఫ్రెండ్ పాత్రల్లోనూ మెరిసింది. కానీ ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి కి హీరోయిన్ అయ్యే ఛాన్స్ దక్కింది. ఆ చిత్రంలో వైష్ణవి చైతన్య నటనకు అల్లు అర్జున్ సహా అందరూ సర్ ప్రైజ్ అయ్యారు.
బేబీ చిత్రం హిట్ తో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చకున్న వైష్ణవి చైతన్య కు ఆ తర్వాత రెండు సినిమాలు చేసింది. కానీ బేబీ మాదిరి సక్సెస్ చూడలేకపోయింది. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ తోనే మరో చిత్రానికి కమిట్ అయినా అది ఎందుకో పట్టాలెక్క లేదు, ఆ తర్వాత చేసిన లవ్ మీ తో వైష్ణవి కి బిగ్ షాక్ తగిలింది.
ఇపుడు సిద్దు జొన్నలగడ్డ జాక్ తోనూ వైష్ణవి చైతన్య కు షాకిచ్చాడు. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి స్క్రీన్ పై రొమాంటిక్ గా రెచ్చిపోయిన వైష్ణవి ని జాక్ రిజల్ట్ నిరాశపరిచింది అనే చెప్పాలి. అందులోను హీరో-హీరోయిన్ ట్రాక్ పై విమర్శలు ఆమెను మరింతగా ఇబ్బంది పెట్టాయని తెలుస్తోంది. జాక్ ప్రమోషన్స్ లో హంగామా చేసిన వైష్ణవి చైతన్య జాక్ రిలీజ్ తర్వాత సైలెంట్ అయ్యింది.
బేబీ తో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య ఆతర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోవడంలో తడబడుతుంది.. మరి ఈ బేబీ కి నెక్స్ట్ మూవీ అయినా హిట్ ఇస్తుందేమో చూద్దాం.