యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ను కలవలేకపోతున్నారు. దేవర తర్వాత పబ్లిక్ ఈవెంట్స్ లో కనబడని ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ ను కలిశారు. తన అభిమానులను కలుస్తాను అన్న ఎన్టీఆర్ అది జరగకుండానే వేరే సినిమాల ఈవెంట్స్ కి గెస్ట్ గా వస్తున్నారు మొన్న బావమరిది కోసం వస్తే నేడు అన్న కళ్యాణ్ రామ్ కోసం వస్తున్నారు.
మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ తన సినిమాలపై అప్ డేట్ ఇచ్చారు. అదుర్స్ 2 దగ్గర నుంచి దేవర 2 వరకు, ప్రశాంత్ నీల్ మూవీ దగ్గర నుంచి నాగవంశీ తో చెయ్యబోయే మూవీ వరకు ఎన్టీఆర్ తన ఫ్యాన్ తో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు.
మరి ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్ లొ ఎన్టీఆర్ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు. తన సినిమాలపై ఎలాంటి అప్ డేట్స్ అందిస్తారు, ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎన్టీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు.