మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. ఆయన హనుమాన్ మాల కూడా వేసుకుని హనుమంతుని భక్తుడిగా పూజలు నిర్వహిస్తారు. రీసెంట్ గా పవన్ కొడుకు మార్క్ శంకర్ కోలుకోవడం హనుమంతుడి దయ, హనుమాన్ జయంతికి తన తమ్ముడు కొడుకు కోలుకుని ఇంటికొచ్చాడని చిరు సంబరపడ్డారు.
అదే హనుమాన్ జయంతి రోజు అంటే ఈరోజు ఏప్రిల్ 12న మెగాస్టార్ నటించిన విశ్వంభర నుంచి వదిలారు. వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. విశ్వంభర రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ నడుస్తున్నా.. ఫస్ట్ సింగిల్ రమరామ తో హనుమాన్ జయంతి రోజు మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు.
రమరామ సాంగ్ లో మెగాస్టార్ లుక్స్ సూపర్బ్ గా ఉన్నాయి, అలాగే సాంగ్ సెటప్ రిచ్ గా ఉంది, లిరిక్స్ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. విశ్వంభర ఫస్ట్ సింగిల్ మెగా ఫ్యాన్స్ ను బాగా ఇంప్రెస్స్ చేసేదిలా ఉంది. కీరవాణి మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, మెగాస్టార్ స్టెప్స్, అన్నిటికి మించి రాముని కోసం హనుమాన్ భక్తితో ఇచ్చే ప్రేమ కానుక ఇలా ఈ రమరామ సాంగ్ కి హైలెట్ గా నిలిచాయి.