సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు, టైలు స్క్వేర్ చిత్రాల సమయంలో కథలో, దర్శకత్వంలో, డైలాగ్స్ విషయంలో అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ చిత్రాలను యూత్ కి దగ్గర చేసాడు అనే టాక్ కాదు అదే నిజం. అందుకే డీజే టిల్లు దర్శకుడు టిల్లు స్క్వేర్ కి వచ్చేసరికి మారిపోయాడు అన్నారు. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తో కూడా సిద్దు ఏదో ఫైట్ చేశాడు అన్నారు.
జాక్ ప్రమోషన్స్ లోను సిద్దు జొన్నలగడ్డ.. బొమ్మరిల్లు భాస్కర్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి వచ్చింది. అయితే జాక్ అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకుల నుంచి ఓవరాల్ గా ఒకేరకమయిన టాక్ తెచ్చుకుంది. జాక్ మూవీ రిజల్ట్ చూసాక సిద్దు నిజంగా ఈ కథలో కానీ, మిగతా విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వలేదా అనిపిస్తుంది. అదే అనుమానం యూత్ లో కలుగుతోంది.
జాక్ చిత్రం చూసాక చాలామంది సిద్దు జెడ్జ్మెంట్ ఏమైంది, సిద్దు యూత్ కి దగ్గరయ్యే చిత్రాలతో వస్తాడు అనుకుంటే.. అవుట్ డేటెడ్ చిత్రంతో బోర్ కొట్టించాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. సిద్దు పెరఫార్మెన్స్ పరంగా అద్దరగొట్టినా, కథ కథలు వీక్ అవడంతో సిద్దు కష్టం వృధా అయ్యింది, అదే జాక్ కి మైనస్ అయ్యింది. అంతేకాదు టిల్లు సీరీస్ లో హీరో-హీరోయిన్ ట్రాక్ ఎంత బాగా వర్కౌట్ అయ్యింది, జాక్ లో అదే మైనస్ అయ్యింది.
సిద్దు జొన్నలగడ్డ-వైష్ణవి ట్రాక్ వీక్, దర్శకత్వంలో బలం లేకపోవడంతో జాక్ ని ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు. మరి ఈ జాక్ కథ, డైరెక్షన్ విషయంలో సిద్దు ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాడబ్బా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.