వరస సక్సెస్ లతో నార్త్ లో టాప్ రేంజ్ కి చేరిన రష్మిక కు సల్మాన్ ఖాన్ సికందర్ బ్రేకులు వేసింది. యానిమల్, పుష్ప ద రూల్, ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్ తో రష్మిక బాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీగా తయారైంది. కానీ సికందర్ రిజల్ట్ అమ్మడు జోరుకు స్పీడు బ్రేకర్ లా
అడ్డుపడింది. ప్రస్తుతం క్రేజీగా కనబడుతున్న రష్మిక మందన్న రీసెంట్ గా తన బర్త్ డే ని ఒమన్ లో సెలెబ్రేట్ చేసుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉంది అని తరచూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి రావడం, వాటిని వారు ఖండించడం చూస్తున్నాం. రీసెంట్ గా రష్మిక బర్త్ డే ని విజయ్ ఒమన్ లో సెలెబ్రేట్ చేసాడు అనేలా ఫొటోస్ ని గుర్తుపట్టారు అభిమానులు, కానీ వారు మాత్రం ఎలాంటి రియాక్షన్ చూపించలేదు.
ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు తన ఫ్రెష్ లుక్స్ ని షేర్ చేసే రష్మిక మందన్న తాజాగా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోజులతో ఉన్న పిక్ షేర్ చేసింది. ఆ పిక్ లో రష్మిక భలే క్యూట్ గా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.