వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వైఎస్ భారతిపై టీడీపీ సోషల్ మీడియా వ్యక్తి చేబ్రోలు కిరణ్ కుమార్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గాను కిరణ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ కిరణ్ ప్రయాణిస్తున్న పోలీస్ వాహనాన్ని అడ్డుకుని కిరణ్ పై దాడికి యత్నం చెయ్యడంతో గోరంట్లను పోలీసులు ఇమ్మీడియట్ గా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న గోరంట్ల మాధవ్ ను కోర్టులో పరచగా.. కోర్టు గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దానితో ఆయనను పోలీసులు నెల్లూరులోని జిల్లా జైలుకు తరలించారు. గతంలో పోలీస్ అయిన గోరంట్ల మాధవ్ పోలిసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడి చేస్తే తనకెలాంటి శిక్ష పడుతుందో తెలిసి కూడా భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై దాడి చెయ్యడం ఏమిటి.
అంటే కావాలనే గోరంట్ల మాధవ్ జైలుకు వెళ్లేలా చేసుకున్నాడా, అసలే కూటమి నేతలు ఎప్పుడెప్పుడు వైసీపీ నేతలు దొరుకుతారా జైల్లో వేద్దామని కాచుకుని కూర్చుంటే గోరంట్ల మాధవ్ కోరి కోరి రిమాండ్ కు వెళ్లడమే వైసీపీ నేతలు తల పట్టుకునేలా చేసింది.