కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నటి విజయశాంతి ఆమె ఫ్యామిలీని చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈమధ్య కాలంలోనే కాంగ్రెస్ నుంచి ఎమ్యెల్సీ గా గెలుపొందిన విజయశాంతి, కళ్యాణ్ రామ్ హీరోగా సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఆ చిత్ర ప్రమోషన్స్ లో విజయశాంతి యూనిట్ తో కలిసి ట్రావెల్ చేస్తున్నారు.
తాజాగా విజయశాంతి ఆమె భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్ ని చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాలుపడడంతో.. బెదిరించిన వ్యక్తిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు చేసారు పోలీసులు. విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ కు కొన్నేళ్ల క్రితం చంద్రకిరణ్‌రెడ్డి పరిచయమయ్యాడు, అతను సోషల్ మీడియాలో విజయశాంతి ని ప్రమోషన్స్ చేస్తానని చెప్పగా.. నీ పని తీరు నచ్చితే కాంట్రాక్టు ఇస్తానని శ్రీనివాస్ చెప్పారట. కానీ చంద్రకిరణ్‌రెడ్డి వర్కింగ్ స్టయిల్ నచ్చని శ్రీనివాస్ అతనికి కాంట్రాక్టు ఇవ్వకపోయినా చంద్రకిరణ్‌రెడ్డి విజయశాంతి ఫ్యామిలీ కి తాను పని చేస్తున్నాను అని చెప్పి పలువురు రాజకీయ నాయకుల వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడట.
అంతేకాకుండా శ్రీనివాస్ ని కాంట్రాక్టు ప్రకారం డబ్బులివ్వాలని చంద్రకిరణ్‌రెడ్డి విజయశాంతి ఫ్యామిలీని బెదిరించడమే కాదు, డబ్బు ఇవ్వకపోతే పరువు తీస్తాను, కసి తీరా చంపుతాను అంటూ బెదిరించడం తో శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా పోలీసులు చంద్రకిరణ్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.