నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ బోయపాటి తో చేస్తున్న అఖండ 2 సెట్స్ లో బిజీగా వున్నారు. అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలోప్రగ్య జైస్వాల్ ఓ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ విషయంలో బోయపాటి సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు.
అఖండ 2 తర్వాత బాలయ్య ఆయనకు వీర సింహ రెడ్డి తో సక్సెస్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో జత కడతారని టాక్ ఉంది. టాక్ కాదు ఖచ్చితంగా ఈ కాంబో లో మూవీ వస్తుంది, త్వరలోనే అనౌన్సమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో క్రేజీ హీరోయిన్ పేరు వినబడుతుంది.
ఆమె మీనాక్షి చౌదరి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకీ సరసన నటించి 300 కోట్ల హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరికి బాలయ్య తో నటించాలనే కోరిక ఉన్నట్లుగా ఈమధ్యనే ఓ షాప్ ఓపెనింగ్ సందర్భంగా బయటపెట్టింది. ఇప్పుడు గోపిచంద్ కూడా బాలయ్య సరసన మీనాక్షి అయితే బావుంటుంది అనుకుంటున్నాడట.
గోపీచంద్ జాట్ విడుదలయ్యింది, హిందీలో అది బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులో కూడా జాట్ రిలీజ్ కాగానే ఆయన బాలయ్య ప్రాజెక్ట్ పైకి వచ్చేస్తారట. ముందుగా బాలయ్యకు హీరోయిన్ ని లాక్ చేసే పనిలో ఉన్నారని, బాలయ్య సరసన ఈ ప్రాజెక్ట్ లో మీనాక్షి చౌదరి నటించే అవకాశం ఉంది అంటున్నారు.