పాకిస్తాన్ లోని ఓ రేవ్ పార్టీలో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రత్యక్షమైంది. కరాచీలో జరిగిన ఈ పార్టీలో అసభ్యకరంగా నృత్యం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో అది కరీనా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే బెబో కరీనా పాకిస్తాన్ కరాచీకి వెళ్లాల్సిన అవసరమేంటి? అన్నదే మీ ప్రశ్న అయితే వివరాల్లోకి వెళ్లాలి.
బెబో కరీనా నిజానికి కరాచీలో జరిగిన రేవ్ పార్టీకి అటెండ్ కాలేదు. ఈ పార్టీలో క్రౌడ్ మాంచి జోష్ మీద ఉన్నప్పుడు అక్కడ ఒక యానిమేటెడ్ వీడియో స్క్రీన్ పై టెలీకాస్ట్ అయింది. ఆ వీడియోలో బెబో కరీనా కనిపించింది. అందాల కరీనా థై స్లిట్ గౌన్ ధరించి కొంత న్యూ* గా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో చూడగానే అసభ్యకరంగా కనిపించడంతో ఫ్యాన్స్ సీరియస్ మోడ్‌లోకి వెళ్లారు. ఈ యానిమేషన్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిపై ఘాటైన పోస్టులతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ పీక్స్ కి చేరుకుంది. ఇలాంటి చెత్త వీడియోని షేర్ చేసినందుకు క్రియేటర్ పై తిట్లు చీవాట్లతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ యానిమేటెడ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతోంది.
నిజానికి బెబో కరీనా అనుమతితో పని లేకుండా పాక్ లో ఒక పబ్లిక్ పార్టీలో ఈ వీడియో ప్లే అయింది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉందా? అనేది లీగల్ టీమ్ పరిశీలిస్తుందేమో చూడాలి. శత్రుదేశంలో ఇలాంటి వీడియోని ప్లే చేయడం భారతీయ మహిళను అవమానించడంగానే భావించాలి. కరీనా ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. దీంతో పాటు హన్సల్ మెహతా దర్శకత్వంలోను బెబో నటించనుందని తెలుస్తోంది.