ఇటీవల కాలంలో పైరసీ అనే భూతం సినిమా ఇండస్ట్రీని ఎంతగా దెబ్బతీస్తుందో చూస్తూనే ఉన్నాం, అప్పట్లో అత్తారింటికి దారేది విడుదలకు ముందే వచ్చేసింది, ఆపై ప్రతి పెద్ద సినిమాకి మొదటి రోజే పైరసీ ప్రింట్స్ దర్శనమిచ్చేవి. రీసెంట్ టైమ్స్ లో అయితే అది మరింత విచ్చలవిడిగా మారింది. నేరుగా HD ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. తండేల్ సినిమాకి జరిగింది అదే. రిలీజ్ అయిన రోజే HD ప్రింట్ అందుబాటులోకి రావడం దానిపై నిర్మాతలు ఆవేదన వ్యక్తం చెయ్యడం చూసాం. నిన్నటికి నిన్న సల్మాన్ సికందర్ రిలీజ్ కి ముందే HD ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చెయ్యడం అంతంత మాత్రంగా ఉన్న ఆ సినిమాని మరింత కుదేలు చేసింది, కుంగిపోయేలా చేసింది. పైరసీ విషయంలో ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ కోరుకుంటున్న దశలో ఆ పైరసీ భూతానికి కళ్లెం వెయ్యగలిగింది మైత్రి మూవీ మేకర్స్.
ఓ అగ్ర తెలుగు నిర్మాణ సంస్థ ఇతర భాషల్లో అక్కడ స్టార్లతో సినిమాలు చెయ్యడమే గొప్ప విషయం అనుకుంటే అలాంటి రెండు సినిమాలని, రెండిటిని ఒకే రోజు రిలీజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది మైత్రి. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జాట్ నిన్న హిందీలో రిలీజ్ అయ్యింది. అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. రెండు సినిమాలకి మిశ్రమ స్పందనలే వస్తున్నప్పటికి ఆయా హీరోల ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనిపించేలా ఆ సినిమాలను మలచడంలో సక్సెస్ అయ్యింది మైత్రి సంస్థ. అందుకే టాక్ తో సంబంధం లేకుండా అభిమానులు మాత్రం థియేటర్స్ కి పరుగులు పెడుతున్నారు, బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ చూపిస్తున్నారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాల పైరసీ ప్రింట్స్ బయటికి రాకపోవడం, రానివ్వకుండా కట్టడి చెయ్యడంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బాగా సక్సెస్ అయ్యింది. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ చేసిన జాక్ పైరసీ ప్రింట్ వచ్చేసింది కానీ.. ఈ అగ్ర హీరోలు చేసిన సినిమాలు మాత్రం రాలేదంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఎంతగా కేర్ తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ సీక్రెట్ ఏంటో మైత్రి వాళ్ళు రివీల్ చేస్తే అది ఇండస్ట్రీలోని ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ పైరసీ ఎఫెక్ట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. చెప్పండి సర్ ఆ సీక్రెట్ ఏంటో.. ఇండస్ట్రీలోని అందరికి, ఎందుకంటే అది అత్యవసరం.