ఆధునిక ప్రపంచంలో ప్రజల్లో బంధాలు బాంధవ్యాలు తెరమరుగవ్వడంపై చాలా ఆందోళనలున్నాయి. ముఖ్యంగా రంగుల ప్రపంచంలో కుటుంబ వివాదాలు, చీటింగ్ వ్యవహారాలు నిరంతరం చర్చగా మారుతున్నాయి. ప్రముఖ నటుడి విడాకులకు సంబంధించిన త్రోబ్యాక్ మ్యాటర్ ఒకటి ఇప్పుడు మరోసారి చర్చగా మారింది.
అతడు తన ఫ్రెగ్నెంట్ వైఫ్‌ని చీట్ చేసాడు. ఆమె గర్భిణిగా ఉండగా, మహిళా జర్నలిస్ట్ తో ఎఫైర్ నడిపించాడు. అంతేకాదు తన భార్యకు డొంక తిరుగుడు లేకుండా, సూటిగా ఆమెను పెళ్లాడుతానని, విడాకులు కావాలని కోరాడు. ఫ్యామిలీ మ్యాటర్ కోర్టుకు వెళ్లింది. అక్కడ భార్యతో బ్రేకప్ డీల్ లో భాగంగా 6లక్షలు చెల్లించేందుకు అంగీకరించాడు. అతడు మొదట తన సెక్రటరీతో రూ.25000 తన మాజీకి పంపించాడు. కానీ ఆమె ఆ డబ్బును తీసుకునేందుకు నిరాకరించింది. దానికి కారణం తన కడుపులోని బిడ్డ చనిపోవడమేనని చెప్పింది.
అయితే ఈ అహంకారమే నువ్వు ఇలా అవ్వడానికి కారణమైందని సెక్రటరీ తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక హాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన తన భర్తను నందిత అనే మహిళా జర్నలిస్ట్ బుట్టలో వేసుకుందని ఆమె వాపోయింది. ఈ కథలో నటుడి పేరు- ఓం పురి. అతడి భార్య సీమా ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ తో చాటింగ్ సెషన్ లో తన ఫ్యామిలీ లైఫ్ ట్రామా గురించి ఓపెన్ గా వెల్లడించింది. గర్భిణిగా ఉన్న తాను విడిపోవాలని అనుకోలేదని, అతడు ఫోన్ లో విడాకులు కోరినప్పుడు తనను తాను నమ్మలేకపోయానని సీమా ఇంటర్వ్యూలో చెప్పారు. అతడి దుస్తులలో తాను ప్రేమలేఖలు కూడా కనుగొన్నానని వెల్లడించింది.