Advertisementt

రెండో పెళ్లి వార్తలపై రేణు దేశాయ్ ఫైర్

Fri 11th Apr 2025 07:34 PM
renu desai  రెండో పెళ్లి వార్తలపై రేణు దేశాయ్ ఫైర్
Renu Desai on Second Marriage రెండో పెళ్లి వార్తలపై రేణు దేశాయ్ ఫైర్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడాకులు అయ్యాక రేణు దేశాయ్ సింగిల్ గా ఇద్దరి పిల్లలను పెంచుతుంది. పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్ కూడా ఒకొనొక సమయంలో రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్దమై ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ ఆ పెళ్లి జరగలేదు. అప్పటినుంచి రేణు దేశాయ్ రెండో పెళ్లి పై రకరకాల వార్తలు వినబడుతూ వున్నాయి. 

తాజాగా రేణు దేశాయ్ ఓ పాడ్ కాస్ట్ లో అమ్మాయిలు రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది.. అని మాట్లాడిన మాటలు మరోసారి రేణు దేశాయ్ రెండో పెళ్లి ప్రచారం జరిగేలా చేసింది. దానితో రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. మీడియా అంతా నా రెండో పెళ్లి విషయమై చాలా వెయిట్ చేస్తుంది. నా పెళ్లి విషయంలో ఏంతో ఆతృతగా ఉందని నాకర్ధమవుతుంది. 

నేను గంటకు పైగా మాట్లాడిన మాటల్లో చాలా విషయాలున్నాయి. కానీ నేను మాట్లాడిన రెండో పెళ్లి కామెంట్స్ ని హైలెట్ చేస్తున్నారు. కానీ నేను మాట్లాడిన మిగతా విషయాలు చాలా ఇంపార్టెంట్. అవన్నీ వదిలేసి నా రెండో పెళ్లి విషయాలపై జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దయచేసి ఈ 44 ఏళ్ళ మహిళ రెండో పెళ్లి విషయమై మీ దృష్టిని మరల్చండి అంటూ రేణు దేశాయ్ వేడుకుంది. 

Renu Desai on Second Marriage:

Renu Desai fire on second marriage rumours

Tags:   RENU DESAI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ