కొద్దిరోజులుగా హీరోయిన్ త్రిష కోలీవుడ్ హీరో విజయ్ తో డేటింగ్ లో ఉంది, విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిష ని వివాహం చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. త్రిష-విజయ్ సీక్రెట్ వెకేషన్స్ కి వెళుతున్నారు అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోపక్క త్రిష నటించిన లేటెస్ట్ ఫిలిం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో త్రిష యాక్టింగ్ పై సోషల్ మీడియాలో నెగిటివిటి మొదలైంది.
ఇదంతా చూసిన త్రిషకు బాగా కోపమొచ్చింది. అందుకే సోషల్ మీడియా వేదికగా తనపై నెగిటివిటి చూపించే వాళ్లపై ఫైర్ అవుతూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత విషం కక్కుతూ మీరెలా జీవిస్తున్నారు. మీకు నిద్రేలా వస్తుంది. పని పాడు లేక ఖాళీగా కూర్చుని ఇతరుల లైఫ్ పై పోస్ట్ లు పెట్టడం తప్ప మీకు వేరే పని లేదా.
మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది. మీరు పిరికి వాళ్ళనే చెప్పాలి, మీతో పాటు జీవించేవాళ్ళను తలచుకుంటే బాధగా ఉంటుంది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ త్రిష తనపై నెగిటివిటీ చూపించే వారిపై పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.