రాజమౌళి తన సినిమా మొదలు పెట్టేప్పుడే మీడియాకి తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి, హీరోల అభిమానుల ఆత్రుత చల్లార్చి రంగంలోకి దిగేవారు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి మొదలు పెట్టిన SSMB 29 విషయంలో మాత్రం ఎందుకో చాలా ఎక్కువ సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు. కనీసం ఓపెనింగ్ కూడా సీక్రెట్ గానే చేశారు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేసిన మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ లో ఉన్నారు. మహేష్ వెకేషన్ నుంచి రాగానే రాజమౌళి తదుపరి షెడ్యూల్ ని విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే మహేష్-రాజమౌళి కాంబో అప్ డేట్ కోసం మహెష్ ఫ్యాన్స్ తో పాటుగా పాన్ ఇండియా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.
మరి మే 31 కృష్ణ బర్త్ డే వరకు SSMB 29 అప్ డేట్ రాదా, అప్పటివరకు రాజమౌళి ఈ సీక్రెట్ ని మైంటైన్ చేసికుంటూ వెళ్ళిపోతారా అనేది అందరిలో నడుస్తున్న అనుమానం. మహేష్ సినిమా నుంచి కృష్ణ గారి జయంతి కి అప్ డేట్స్ రావడమనేది పరిపాటి, లేదంటే ఆగష్టు 9 మహేష్ బర్త్ డే వరకు SSMB 29 వరకు అప్ డేట్ రాకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. చూద్దాం రాజమౌళి ఎప్పుడు మీడియా ముందుకు వస్తారో అనేది.