నిన్న ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన మూడు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మూడు రకాల స్పందన కనిపించింది. తెలుగు హీరో టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన జాక్(J) చిత్రానికి అటు ఆడియన్స్ నుంచి, ఇటు క్రిటిక్స్ నుంచి సో సో టాక్ వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ను హీరోయిన్ గా పెట్టి సిద్దు హీరోగా వచ్చిన జాక్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చెయ్యడంలో తడబడింది.
అదే రోజు అంటే ఏప్రిల్ 10 తెలుగు నిర్మాత, తెలుగు దర్శకులు కలయికలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ని పెట్టి తెరకెక్కించిన మరో J అంటే జాట్ చిత్రం నార్త్ లో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఫస్ట్ టైం బాలీవుడ్ లో అడుగుపెట్టి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో మన తెలుగు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్ నిర్మించిన జాట్ కి నార్త్ ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ప్రశంశలు దక్కాయి.
ఒకే రోజు విడుదలైన ఒక J అంటే జాక్ టాక్ తేడా కొట్టగా, మరో J అంటే జాట్ మాత్రం రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా ప్రయాణం మొదలు పెట్టింది. ఒకే రోజు రెండు J లు ఆడియన్స్ నుంచి రెండు రకాల రెస్పాన్స్ దక్కించుకున్నాయి.