రాజకీయాల్లోకి వెళ్ళాక దాదాపుగా నటనకు బ్రేక్ తీసుకున్న ఆర్కే రోజా బుల్లితెర మీద అందులోను ఒక్క ఈటీవి లోనే కొనేళ్లపాటు జబర్దస్త్ కి వన్ ఆఫ్ ద జెడ్జి గా పని చేసింది. కామెడీ షో జబర్దస్త్ కి నాగబాబు తో కలిసి జెడ్జి గా మారిన రోజా తనకి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి వచ్చాక జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. అంతకుముందు ఈటీవీలో ఏ ఫెస్టివల్ ప్రోగ్రాం వచ్చినా రోజా గెస్ట్ గానే కనిపించేది.
మంత్రి అయ్యాక జబర్దస్త్ ని, ఈటీవిని వదిలేసిన రోజా ఈ ఎన్నికల్లో ఎమ్యెల్యే గా కూడా గెలవలేకపోవడంతో మళ్ళీ బుల్లితెర వైపు చూసింది. ఇప్పటికే జబర్దస్త్ లో చాలామంది జెడ్జిలు మారి ఫైనల్ గా శివాజీ, ఖుష్బూ, లయ కనబడుతున్నారు. అయితే రోజాని ఈటీవి పట్టించుకోలేదో, లేదంటే వదిలించుకుందో, కాదు రోజానే వద్దనుకుందో తెలియదు కానీ.. రోజా ఇప్పుడు బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది.
అది కూడా జీ తెలుగు లోకి. అనిల్ రరావిపూడి, రోజా జెడ్జి లుగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా జీ తెలుగులో రేపు శనివారం నుంచి మొదలు కాబోయే డ్రామా జూనియర్స్ కి రోజా వన్ ఆఫ్ ద జెడ్జి. ప్రస్తుతం రోజా డ్రామా జూనియర్స్ లో పిల్లలతో కలిసి చేసిన స్కిట్ ప్రోమోస్ వదులుతున్నారు. అది చూసిన నెటిజెన్స్ రోజాను ఈటీవి వదిలించుకుంది-జీ తెలుగు తగిలించుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.