కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లేక వెల వెల బోతుంది. ఈ సమయంలో సౌత్ సినిమాలు పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ బాలీవుడ్ బాక్సాఫీసుని చెడుగుడు ఆడుకుంటున్నాయి. సౌత్ సినిమాల హవాలో బాలీవుడ్ మేకర్స్ క్రియేటివిటీని మర్చిపోయి రీమేక్ కథలపై ఆధారపడుతున్నారు.
అందుకే అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకులు బాలీవుడ్ ఇండస్ట్రీ మారాలంటూ సలహాలు ఇవ్వడమే కాదు, ఆఖరికి ఆ ఇండస్ట్రీని వదిలి సౌత్ కి వచ్చేసారు. ఇలా చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీ బ్యాక్ బౌం అవ్వాలంటే ఇలా చెయ్యాలి అలా చెయ్యాలంటూ సలహాలిస్తున్నారు.
అందులో ఇప్పడు సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా చేరింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్లీ హిట్ కళ రావాలంటే..
బాలీవుడ్ మూస ధోరణి వదిలి కథల విషయంలో మరింత లోతుగా విశ్లేషించగలగాలి. సౌత్ సినిమాలు డబ్బింగ్ రూపంలో ఓటీటీలలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. వాటిని రీమేక్ చెయ్యడం వలన ఫలితం ఉండదు, ఈ విషయంలో బాలీవుడ్ చాలా మారాల్సిన అవసరం ఉంది. ఆడియన్స్ ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు.
స్టార్స్ లేకపోయినా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ హిట్ అవుతున్నాయి. ఓటీటీ లు కూడా కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అలాంటి పోటీని తట్టుకుని థియేట్రికల్ మర్కెట్లో నిలబడాలంటే అంతకు మించిన క్రియేటివి కథలు, అంతకు మించి వ్యూహ రచన చెయ్యాలి అంటూ రాశి ఖన్నా బాలీవుడ్ కి సలహాలిస్తుంది.