Advertisementt

కన్నప్పకు కావాల్సినంత పబ్లిసిటీ చేస్తున్న మనోజ్

Fri 11th Apr 2025 10:59 AM
kannappa  కన్నప్పకు కావాల్సినంత పబ్లిసిటీ చేస్తున్న మనోజ్
Manchu Manoj Comments On Manchu Vishnu Kannappa కన్నప్పకు కావాల్సినంత పబ్లిసిటీ చేస్తున్న మనోజ్
Advertisement
Ads by CJ

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కన్నప్ప ని తెరకెక్కించారు. అందులో పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి టాప్ స్టార్స్ భాగమైనప్పటికీ.. కన్నప్ప విడుదల తేదీలు పదే పదే మారిపోతూ ఉండంతో ఆ చిత్రం పై క్రేజ్ తగ్గిపోతుంది. మంచు విష్ణు పలు రాష్ట్రాల సీఎం లను కలిసి కన్నప్ప పై హైప్ క్రియేట్ చేస్తున్నా.. ఎందుకో కన్నప్ప పై బజ్ క్రియేట్ అవ్వడం లేదు.

కానీ ఇప్పుడు మంచు మనోజ్ తన అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కోసం కావాల్సినంత ప్రమోట్ చేస్తున్నాడు, నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాడు అనిపించేలా అతను చేస్తున్న చేష్టలు, వేస్తున్న ట్వీట్లు కనిపిస్తున్నాయి. నేను ఆస్తి కోసం పోరాడడం లేదు అంటూ అన్న విష్ణు కన్నప్ప పై తను నటించిన భైరవం వదులుతా అంటూ ఛాలెంజ్ చేసాడు. ఈలోపు కన్నప్ప రిలీజ్ డేట్ మారిపోయింది. 

దానితో మంచు మనోజ్ నేను నా సినిమాని కన్నప్ప పై పోటీకి విడుదల చేస్తాను అనగానే కన్నప్ప రిలీజ్ వాయిదా వేశారంటూ మీడియా ముందు మాట్లాడాడు, అంతేకాదు కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ చూసి.. Mark your calendars! 📅 The legend of #Dongappa  hits the big screen on 27th June! 🎥 Inthaki release jul 17th aa, Ledha June 27th. 100 crore plus (80% #ViSmith commission) budget movie pr planning keka.. అంటూ ట్వీట్ చేసాడు. 

కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంతమంది దానిని పబ్లిసిటీ చేసారో తెలియదు కానీ.. మనోజ్ వేసిన ట్వీట్ ని మాత్రం మీడియా మొత్తం పబ్లిసిటి చేసింది. ఇదంతా చూసి కన్నప్పకు కావాల్సినంత పబ్లసిటీ మనోజ్ ఇస్తున్నాడంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Manchu Manoj Comments On Manchu Vishnu Kannappa:

Kannappa Not Its Dongappa Movie Manchu Manoj Viral Post

Tags:   KANNAPPA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ