బాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన విక్కీ కౌశల్-రష్మిక మందన్న ల ఛావా చిత్రం నార్త్ ఆడియన్స్ నే కాదు సౌత్ ఆడియన్స్ ను కూడా బాగా ఇంప్రెస్స్ చేసింది. ఛావా మౌత్ టాక్ తోనే రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఛావా చిత్రానికి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవడంతో ఈ ఎడాది బాలీవుడ్ లో బిగ్ హిట్ గా నిలిచింది.
ఎప్పుడో ఫిబ్రవరిలోనే థియేటర్స్ లో విడుదలైన ఛావా చిత్రం ఇంకా ఇంకా కలెక్షన్స్ రాబట్టడంలో మేకర్స్ దీని ఓటీటీ స్ట్రామింగ్ లేట్ చేస్తూ వచ్చారు మేకర్స్. ఛావా డిజిటల్ హక్కులను అన్ని భాషలకు కలిపి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో కొనుగోలు చేసింది.
గత నెల నుంచే ఛావా ఎప్పుడెప్పుడు నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుందా అని ఫ్యామిలి ఆడియెన్స్ ఎదురు చూసారు, ఎట్టకేలకు ఏప్రిల్ 11 అంటే ఈరోజు నుంచి ఛావా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి రాగా ఇక్కడో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఛావా మేకర్స్. ఈ చిత్రం కేవలం హిందీలో మాత్రమే నెట్ ఫ్లిక్స్ నుంచి అందుబాటులోకి వచ్చింది.
మిగిలిన పాన్ ఇండియా భాషల్లో చావా ఓటీటీ రిలీజ్ లేకపోవడంతో సౌత్ ఆడియన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. మరి అదెప్పుడు వదులుతారో స్పష్టత రావాల్సి ఉంది.