అక్కినేని అఖిల్ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం కాబోయే భార్య జైనబ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. నాగ్-అమల కూడా వెళ్లకుండా కేవలం తన ఫియాన్సీ తో కలిసి అఖిల్ వెకేషన్ కి వెళ్లి అక్కడే బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. My Everything అంటూ జైనబ్ ని హగ్ చేసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వదిలాడు అఖిల్.
ఆ పిక్స్ నెట్టింట సంచలనంగా మారాయి. ఇక బర్త్ డే వేడుకలు ముగించుకుని అఖిల్ నిన్న ఏప్రిల్ 10 రాత్రి తిరిగి హైదరాబాద్ కి చేరుకున్నాడు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అఖిల్, జైనబ్ చెయ్యి పట్టుకుని కారు వరకు నడుచుకుంటూ రావడమే కాదు.. జైనబ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించాడు.
జనాబ్ కారు ఎక్కాక తాను కూడా కారులో కూర్చున్న ఎయిర్ పోర్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కడుతుంది. ఇకపై అఖిల్ తన లెనిన్ షూటింగ్ లో బిజీగా మారబోతున్నాడు.