Advertisementt

నా ఫియాన్సీ 3సార్లు చీట్ చేసాడు- మ‌హ్వాష్

Thu 10th Apr 2025 08:43 PM
mahvash  నా ఫియాన్సీ 3సార్లు చీట్ చేసాడు- మ‌హ్వాష్
My fiancé cheated on me 3 times - Mahvash నా ఫియాన్సీ 3సార్లు చీట్ చేసాడు- మ‌హ్వాష్
Advertisement
Ads by CJ

ఇటీవ‌ల భార‌త క్రికెట‌ర్ చాహ‌ల్ అత‌డి భార్య, కొరియోగ్రాఫ‌ర్ ధ‌న‌శ్రీ వ‌ర్మ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల వార్త‌ల‌  స‌మ‌యంలో అత‌డు ఆర్జే మ‌హ్వాష్ తో క‌నిపించాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా రిలేష‌న్ కూడా ఈ బ్రేకప్ కి కార‌ణం అంటూ ప్ర‌చార‌మైంది. కానీ మ‌హ్వాష్ దానిని ఖండించింది. ఇప్ప‌ట్లో పెళ్లి ఆలోచ‌నే లేద‌ని కూడా వెల్ల‌డించింది.

ధ‌న‌శ్రీ లాంటి బ్యూటిఫుల్ వైఫ్ నుంచి విడిపోయిన చాహ‌ల్ కి హ‌హ్వాష్ లాంటి అంద‌మైన స్నేహితురాలు దొర‌క‌డం అదృష్టం! అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. అదంతా అటుంచితే, మ‌హ్వాష్ కి అంత‌కుముందే నిశ్చితార్థ‌మైంది. రెండేళ్ల పాటు కాబోయే భ‌ర్త‌తో ప్ర‌యాణం సాగించినా, అత‌డు త‌న‌ను ఘోరంగా చీట్ చేయ‌డంతో విడిపోయాన‌ని మ‌హ్వాష్ వెల్ల‌డించింది. అలీఘ‌ర్ లాంటి చిన్న ప‌ట్ట‌ణంలో త‌న‌కు చాలా అవ‌మానాలు ఎదుర‌య్యాయ‌ని తెలిపింది.

అంతేకాదు.. అత‌డు వేరొక అమ్మాయికి నీ ముద్దు చాలా బావుంటుంది! అనే మెసేజ్ పంపించ‌డం చూశాన‌ని ఆర్జే మ‌హ్వాష్ తెలిపింది. నేను అంత మంచి కిస్స‌ర్ ని కాదేమోన‌నే సందేహం క‌లిగింది! అత‌డు ఒక‌సారి కాదు మూడుసార్లు మోసం చేసాడు. అది తట్టుకోలేక వైద్యుల‌ను క‌ల‌వాల్సి వ‌చ్చింది. మాన‌సిక నిపుణులు కౌన్సిల‌ర్ల‌ను క‌లిసాను.. ఆస్ప‌త్రి పాల‌య్యాను! అని గ‌తాన్ని గుర్తు చేసుకుంది మ‌హ్వాష్‌. జీవితంలో కాబోయే భ‌ర్త చీటింగ్ ని త‌ట్టుకోలేక‌పోయాన‌ని ఆమె తెలిపింది. నిజానికి మ‌హ్వాష్ వ్య‌క్తిగ‌త జీవితంలో చీక‌టి కోణం ఉంది. దీనిని తెలుసుకోకుండానే, చాహ‌ల్ తో ముడిపెట్టి మీడియాలు వార్త‌లు రాసాయి. 

My fiancé cheated on me 3 times - Mahvash:

RJ Mahvash Reveals Being Cheated Thrice By Ex-Fiance

Tags:   MAHVASH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ