వైసీపీ మాజీమంత్రి, కీలక నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ క్షణాన అయినా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా కాదు కాకాణి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గత పది రోజులుగా పోలీసులకు దొరక్కుండా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు కాకాణి.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై కాకాణి పై కేసులు నమోదు అయ్యాయి. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగం పైనా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ కేసులోనూ కాకాణి తనని అరెస్ట్ చెయ్యకుండా ముందంటూ బెయిల్ తెచ్చుకునేవరకు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు.
కానీ పోలీసులు మాత్రం కాకాణి ని వదిలేలా లేరు. నెల్లూరు జిల్లాలో ఆరు బృందాలతో కాకాణి కోసం పోలిసులు గాలింపు చేపట్టారు. కాకాణి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు. అంతేకాకుండా కాకాణి తప్పించుకోకుండా అన్ని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులకు సమాచారం ఇచ్చారు.