బుల్లితెర మీద సక్సెస్ ఫుల్ యాంకర్ మాత్రమే కాదు, విపరీతమైన క్రేజ్ ఉన్న మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. గతంలో వెండితెర పై కూడా ప్రదీప్ మాచిరాజు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. అప్పటినుంచి బుల్లితెర పై బిజీగా ఉంటూ లాంగ్ బ్రేక్ తీసుకుని మరో సినిమా చేసాడు.
అది కూడా మరో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్ గా ప్రదీప్ మాచిరాజు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ టైటిల్ తో రేపు ఏప్రిల్ 11 న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ప్రదీప్ మాచిరాజు కి వెండితెర ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.
రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఫస్ట్ టికెట్ కొనిపించి ప్రమోషన్ చేసిన మాచిరాజు కి వెండి తెరపై ఎంతవరకు టికెట్లు తెగుతాయో, బుల్లితెర క్రేజ్ సినిమా టికెట్స్ ఎంతవరకు తెగేలా చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది.