డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ నుంచి వచ్చే ప్రాజెక్ట్ అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. టిల్లు సీరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ కథల ఎంపికపై అందరిలో ఓ విధమైన కాన్ఫిడెంట్ కనిపించింది. అందుకే సిద్దు ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఎవ్వరికి ఆ సినిమాపై అనుమానం కలగలేదు, సిద్దు-బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన జాక్ చిత్రం నేడు ఏప్రిల్ 10 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పటికే జాక్ ప్రీమియర్స్ పూర్తి కావడంతో ఆడియన్స్ సోషల్ మీడియా ట్విట్టర్ X లో హంగామా మొదలు పెట్టేసారు.
జాక్ ట్విట్టర్ రివ్యూలోకి వెళితే.. ఫస్ట్ హాఫ్ పర్లేదు అని కొంతమంది జాక్ ని వీక్షించిన వారు చెబుతుంటే, మరికొందరు కొన్ని చోట్ల సిద్దు కామెడీ వర్కౌట్ అయిందని ట్వీట్లు పెడుతున్నారు. జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ, కానీ ఏ చోటా స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదు అంటూ మరో నెటిజెన్ ట్వీటేచేసాడు.
సెకండాఫ్ తేడా కొట్టేసిందని అంటున్నారు. కమర్షియల్ అంశాల్ని జోడించి బొమ్మరిల్లు భాస్కర్ సినిమాను తీయాలని అనుకున్నాడు, కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే, వీక్ రైటింగ్‌తో బోర్ కొట్టేస్తాయంటూ మరో ఆడియన్ స్పందన ఉంది.
స్పై పోర్షన్, టెర్రరిస్ట్ ఎపిసోడ్స్, మ్యూజిక్ చిరాకు పెట్టించింది, సిద్దు సింగిల్ గా ఎంతవరకు సినిమాని మోస్తాడు, ఒకొనొక సమయంలో సిద్దు చేతుల్లో కూడా ఏం లేదు అనేలా జాక్ కథనం ఉంది. ఇంత చెప్పాక కూడా జాక్ ని చూడాలనిపించి థియేటర్ కి వెళితే అది మీ ఖర్మ అంటూ మరో నెటిజెన్ ఘాటైన ట్వీట్ చెసాడు. మరి జాక్ అసలు కథ ఏమిటి అనేది పూర్తి రివ్యూలో చూసేద్దాం.