అల్లు అర్జున్-అట్లీ కాంబో ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవల్లో అనౌన్సమెంట్ ఇచ్చారు. అనౌన్సమెంట్ వీడియో తోనే అందరికి ఈ ప్రాజెక్టు పై స్పెషల్ ఇంట్రెస్ట్ తో పాటుగా బోలెడన్ని అంచనాలు మొదలయ్యేలా చేసారు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అంతకుమించిన ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయడం పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతుంటే మిగతా స్టార్ హీరోలు అవాక్కయ్యారు.
ఈ సినిమాకు దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుందని, ఇప్పటివరకు అంతలాంటి బడ్జెట్ తో సినిమా తెరకెక్కలేదని, హాలీవుడ్ రేంజ్ లోనే అట్లీ.. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసాడని తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా అల్లు అర్జున్ కి జోడిగా నటించబోయే ఆ హీరోయిన్ పై పిచ్చ క్యూరియాసిటీ మొదలైంది అందరిలో.
మరి అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ లోకి ఏ హీరోయిన్ ఎంటర్ అవుతుంది. అది బాలీవుడ్ హీరోయిన్ అయ్యి ఉంటుందా, లేదంటే హాలివుడ్ నుంచి తెస్తారా, సమంత ఈప్రాజెక్టు లో భాగమయ్యే ఛాన్స్ ఉంది అనే వార్తలు వినబడుతున్నాయి. అల్లు అర్జున్ కి రెండు వేర్వేరు గెటప్పులు ఉండే అవకాశం ఉన్నందున, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ అవసరమవుతారని తెలుస్తోంది. మరా లక్కీ ఛాన్స్ ఎవరికీ తగులుతుందో చూడాలి.