రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బావమరిది నటించిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్ లో పాల్గొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిచ్చారు. చాలా రోజుల తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
ఇప్పుడు ఎన్టీఆర్ మరో ఈవెంట్ కి రాబోతున్నారు.
అదేమిటో తెలుసుగా, ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ గెస్ట్ గా రాబోతున్నారనే ప్రచారాన్ని కళ్యాణ్ రామ్ నిజం చేసారు. ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సాంగ్ రిలీజ్ లో కళ్యాణ్ రామ్ ఆ విషయాన్ని అభిమానుల నడుమ ప్రకటించారు.
ఏప్రిల్ 11 న జరగబోయే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ్ముడొస్తాడు, తమ్ముడు తారక్ ఆ ఈవెంట్ లో మాట్లాడతాడు అంటూ అనౌన్స్ చేసారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నలు మూలల నుంచి హైదరాబాద్ కి వచ్చెయ్యడం పక్కా.