అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే నటి. అనసూయ ఇప్పుడు స్టార్ మా లో వస్తోన్న కిర్రాక్ బాయ్స్-కిలాడీ గర్ల్స్ షో కి జెడ్జి గా వస్తుంది. శేఖర్ మాస్టర్ తో కలిసి అనసూయ గ్లామర్ షో చేస్తూ జెడ్జి గా అదరగొడుతుంది. ట్రోల్స్ ని, నెగెటివ్ కామెంట్స్ ని అస్సలు పట్టించుకోదు.
ఇక సోషల్ మీడియాలో గ్లామర్ షో లుక్ దగ్గర నుంచి ట్రెడిషనల్ లో వరకు అనసూయ భరద్వాజ్ అందాల ఆరబోత ఎప్పుడూ ప్రత్యేకమే. తాజాగా నిన్ను కోరి అంటూ క్యాప్షన్ పెట్టి ఎల్లో శారీ లుక్ ని పోస్ట్ చేసింది అనసూయ. మరి ఎల్లో సారీ, దానికి మ్యాచింగ్ బ్లూ బ్లౌజ్ లో అనసూయ అందం గురించి ఏమని వర్ణించాలి.
తలకి కొప్పు దానిని గులాబీ పూల మాల తో చుట్టిన అనసూయ సోయగం మాత్రం అద్భుతః అనాల్సిందే. అనసూయ శారీ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.