మంచు అన్నదమ్ముల వార్ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప అంతం కావడం లేదు, సినిమాటిక్ రేంజ్ కాదు సీరియల్ రేంజ్ లో మంచు అన్నదమ్ముల ఆస్తి వార్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు తిరుగుతుంది. కొద్దిరోజులుగా మంచు విష్ణు ఫ్రేమ్ లోకి రాకుండా మోహన్ బాబు ను ముందు పెట్టి మంచు మనోజ్ ని తిప్పలు పెడుతుంటే, మనోజ్ రోడ్డెక్కి విష్ణు పరువు తీస్తున్నాడు.
తాజాగా తన జల్ పల్లి ఇంటిలోని కారు, ఇంకా కొన్ని వస్తువులను విష్ణు ఆయన అనుచరులు ఎత్తుకెళ్లారంటూ మనోజ్ కేసు పెట్టాడు. తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్లొచ్చేసరికి విష్ణు అతనికి అనుచరులు తమ ఇంటిలోని కార్లు, ఇంకొన్ని వస్తువులు దొంగిలించారని మనోజ్ గొడవ చేస్తున్నాడు. మంచు మనోజ్ రీసెంట్ గా ఫ్యామిలీతో సహా కుమార్తె దేవసేన బర్త్ డే కోసం రాజస్థాన్ వెళ్లి గత రాత్రే తిరిగివచ్చాడు. వచ్చాక ఈ పంచాయితి.
అయితే మనోజ్ ని ఇంట్లోకి వెళ్లకుండా పోలీస్ లు అడ్డుకున్నారు. మనోజ్ అక్కడ గొడవ చేసే అవకాశం ఉన్నందున పోలీసులు భారీగా మోహరించి అడ్డుకోగా మనోజ్ అక్కడ ఆందోళనకు దిగాడు. ఇంట్లో కి వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఉందని మనోజ్ వాదిస్తున్నాడు.