పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటవారసుడు అకీరా నందన్ సినీఎంట్రీ గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది. త్వరలోనే అకీరానందన్ హీరో అవుతాడని, విదేశాలలో నటశిక్షణ పూర్తి చేసాడని కూడా ప్రచారమైంది. అయితే ఇప్పటివరకూ అకీరా మాతృమూర్తి రేణు దేశాయ్ కానీ, తండ్రి పవన్ కల్యాణ్ కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
రేణు దేశాయ్ గతంలో అకీరా సినీఎంట్రీ గురించి వచ్చిన వార్తలను ఖండించారు. ఇప్పుడు మరోసారి ఓ చాటింగ్ సెషన్ లో అకీరా సినీఎంట్రీ గురించి సాగుతున్న ప్రచారాన్ని ఖండించడం చర్చగా మారింది. అకీరా నందన్ తన తండ్రి పవన్ తో పాటు `ఓజీ`లో కనిపిస్తారన్న ప్రచారాన్ని రేణు తప్పు పట్టారు. అకీరాకు అన్నయ్య చరణ్ స్వయంగా కాస్ట్యూమ్స్ అందిస్తున్నారన్న ప్రచారాన్ని కూడా ఖండించారు. అలాంటి ఒక వీడియోని తాను అకీరాకు షేర్ చేస్తే, అలాంటివి తనకు పంపొద్దని అన్నట్టు గుర్తు చేసుకున్నారు. దీంతో అకీరా సినీఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనని క్లారిటీ వచ్చేసింది.
టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ నటవారసుడు అకీరా నందన్ సినీఎంట్రీ చాలా కాలంగా సందిగ్ధతలో ఉంది. అలాగే మరో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పైనా సరైన అప్ డేట్ లేదు. అక్కినేని నటవారసుడు అఖిల్ సినీఎంట్రీ తర్వాత పెద్ద స్టార్ల కుటుంబాల నుంచి నటవారసుల ఎంట్రీపై సరైన సమాచారం ఏదీ లేదు.